3218) సన్నుతింతు నెప్పుడెహోవాను తన కీర్తి నా నోట నుండును

** TELUGU LYRICS **

    సన్నుతింతు నెప్పుడెహోవాను - తన కీర్తి నా నోట నుండును

1.  అతిశయింతు నెహోవానుబట్టి - సంతోషింతురు దీనులు విని

2.  ఘనపరచుడి దేవుని పేరు - గొప్ప చేయుదము ఏకముగా

3.  తనయొద్ద నే విచారించగా - తప్పించె నన్ను భయముల నుండి

4.  తనను చూడగ వెల్గు కలిగెను - తమ ముఖములు లజ్జింపకుండె

5.  యెహోవా భక్తులందరి చుట్టు - దూత కావలి యుండి రక్షించు

6.  దేవుడుత్తముడని రుచిచూడు - ధన్యుడు తన్నాశ్రయించువాడు

7.  ఆకలెత్తు సింహపు పిల్లలకు - ఆశ్రితుల కేమి కొదువలేదు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------