3216) సన్నుతించెదను ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తి నానోటనుండు

** TELUGU LYRICS **

    సన్నుతించెదను ఎల్లప్పుడు
    నిత్యము ఆయన కీర్తి నానోటనుండు

1.  యెహోయాకు ప్రార్ధించగా - నా భయమంత తొలగించెను
    శ్రమలన్నిటిలో నాతో నుండి (2)
    చేరదీసి నన్ను ఆదరించె - ఆరాధించెద నెల్లప్పుడు

2.  జీవితమంతా పాడుచుందును - నీ మేలులకు ఓ ప్రభువా
    నా ఆయుష్కాల మంతయును
 (2)
    నీ విశ్వాస్యత కొరకెప్పుడు - నిరతము నిన్ను స్తోత్రింతు

3.  మహోన్నతమైనది నీదు మహిమ - ఘనత ప్రభావముగల ప్రభువా
    తనివి తీరగ నిను పూజింతు
 (2)
    తరగని నీ కార్యములకై - తప్పక నిన్ను స్తుతియింతు

4.  నీ సంకల్పమును నెరవేర్చి - నడిపించితివి ఘనముగను
    నాకు ప్రభుడవై నా కాపరివై
 (2)
    నా జీవితములో వున్నావు - నిజముగ నిన్ను పొగడెదను

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------