3199) సంస్తుతింతుము నిన్నే సౌలును విడచితివి

** TELUGU LYRICS **

1.  సంస్తుతింతుము నిన్నే - సౌలును విడచితివి
    దావీదును కోరుకొని - దీవించిన యెహోవా

2.  యెష్షయి పుత్రులలో - ఎర్రని వాడతడు
    నేత్రాలు చక్కనివి - నేర్పరి మాటలలోన

3.  రత్నవర్ణుడు యేసు - మాటలు దయగలవి
    గువ్వలవలె వెలయు - కన్నులు గలవాడేసు

4.  బెత్లెహేమునందు - ఖ్యాతిగా వాయించి
    సొంపగు పాటలు పాడే - సుగుణాల సుందరుడు

5.  పరమగీతము పాడే - పావనుడు మన యేసు
    నేర్పరి మాటలలోన - నజరేతు నివాసి

6.  వీరుడగు యౌవనుడు - శూరుడు యుద్ధమున
    తల్లిని మించి యెహోవా - తనతోడై యున్నాడు

7.  నేను కోరిన దితడే - వాని అన్నలముందు
    అభిషేక తైలముతో - అభిషేకించుము వాని

8.  సంఘవరుడగు క్రీస్తు - సత్యముగ మన శిరస్సు
    ఆత్మాభిషిక్తుండై – అలరారుచున్నాడు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------