** TELUGU LYRICS **
సకల జగజ్జాల కర్తా భక్త సంఘ హృదయ తాప హర్తా యకలంక
గుణమణి నికర పేటీ కృత ప్రకట లోకచయ పరమ దయాలయ

||సకల||
1. నాదు నెమ్మది తొలఁగించుచుఁ బ్రతి వాదు లీమెయి నెంతో పాదుకొన్నారు
బాధలందైనను సాధులఁభ్రోవ ననాది యైనట్టి నీవాధారమైయుండ
||సకల||
2. దినకృత్యములఁ గష్టమంత చీఁకటినినే నీ కడ భక్తి మనవిజేయ
వినుచు నా కష్టము వెస నష్టముగఁ జేయ ఘనముగ నాయందుఁ గరుణఁ జేసితివి

3. తమ కాపు నన్నుఁ కాపాడఁగ నేనుత్తమ నిద్రఁ బొందితిఁ దనివిఁదీరఁ
కొమ రొప్ప మేల్కొన్నఁ గూలిన మృత్యు భయముబొంద నా డెంద
మందు నెల్లప్పుడు

4. రాతిరి సుఖనిద్ర జెందఁ జేసి రక్షింప నను నీకె చెల్లు ప్రాతస్తుతుల్
జేయఁ బగలు జూచు తెల్వి ఖ్యాతముగా నాకుఁ గలుగఁజేసితివి

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :