3194) సంపూర్ణ రక్షణయూట పొంగుచున్నది చూడుము

** TELUGU LYRICS **

1.  సంపూర్ణ రక్షణయూట - పొంగుచున్నది చూడుము
    ప్రవహించే రక్షకుని ప్రక్క - గాయమునుండి ఎల్లెడల
    సంపూర్ణ రక్షణ ప్రవహించె - శాశ్వత రక్తనదులు

2.  హా! మహిమ ప్రత్యక్షత చూడు ఎడతెగని ప్రవాహము
    శిక్షయును మచ్చల కడిగెను - హిమముకంటె ధవళముగా
    పూర్ణరక్షణ నెరుగుటచేత - ఆశీర్వాదములు కల్గున్

3.  అడ్డులేని ప్రేమ ప్రవాహం - ప్రవహించె నన్ని చోట్ల
    శుద్ధముగానుంచును తలంపులను - వాంఛలను సదాకాలం
    పాపమలిన శక్తినుంచి - సంపూర్ణమగు రక్షణ

4.  నిత్యమోక్ష జీవము దిగెను - నా హృదయ ఆలయమందు
    దేవుడు నరుడైక్యపడుట - ఆహా! ఎంతటి స్నేహమిది
    క్రీస్తుతో దివ్యజీవమునకు - జేర్చబడిన రక్షణ

5.  దుఃఖము చీకటి భయము సిగ్గు - చింత నావిక కానేరవు
    నా రక్షకుడు ముందు నడుచును చీకటి లేదు విశ్వాసములో
    సర్వసంపూర్ణమగు రక్షణ - శాశ్వతమగు రక్షణ

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------