3231) సమాధానము దేవుని సమాధానము

** TELUGU LYRICS **

    సమాధానము - దేవుని సమాధానము (2)
    ఇష్టులైన మనుష్యులకు సమాధానము
    దేవుని కిష్టులైన మనుష్యులకు సమాధానము (2)

1.  దయగలదేవుడు - ఈ భువి - కరుదెంచెను
    ప్రాణమిచ్చె సిలువలో - నిన్ను ప్రేమించి (2)
    ఈ ప్రేమను ఎరిగి - నీవు విరిగిపోతే - సమాధానము

2.  దుష్టులకు నెమ్మది - లేదనెను దేవుడు
    శాంతి మార్గమును - వారెరుగరనెను
    మారు మనస్సు పొందితే - వారికి దొరుకు - సమాధానము

3.  ఒప్పుకొనుము నీ పాపము - యేసుని యొద్ద
    క్షమియించి - పరిశుద్ధునిగా చేయును
    అప్పుడు నీ ఆత్మలో పొందెదవు - సమాధానము

4.  ఆయన ఉపదేశము - నవలంబించుము
    హృదయములో - నుంచుకొనుము ఆ మాటలను
    ఆయనతో సహవాసము - చేసిన యెడల - సమాధానము

5.  చింతించవలదు - ఏ - విషయమందును
    తెలియజేయుడి - దేవునికి విన్నపములతో
    తలంపు హృదయములకు - కావలియుండును - సమాధానము

6.  నిన్నాశీర్వదించి కాపాడు - దేవుడు
    ప్రకాశింపజేయును - తన కృపాసన్నిధి
    నిన్నాశీర్వదించి - యిచ్చు తన నామమున – సమాధానము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------