3136) శాశ్వతమైనది ప్రేమ యెహోవా తండ్రి ప్రేమ

** TELUGU LYRICS **

    శాశ్వతమైనది ప్రేమ - యెహోవా తండ్రి ప్రేమ
    అను పల్లవి: ప్రేమలో భయమేమియు లేదు - 
    ప్రేమ పరిపూర్ణంబైయున్న
    భయమును - పారగద్రోలున్

1.  దీర్ఘకాలము ప్రేమ - దయచూపి సహించును
    మత్సరపడదీ యుత్తమ ప్రేమ
    డంబముగా నడువనిదీ ప్రేమ - ఉప్పొంగనిదీ ప్రేమ

2.  స్వప్రయోజనమును - ఎప్పుడు కోరనిదీ ప్రేమ
    అమర్యాదగ నడువని ప్రేమ
    త్వరగా కోపపడని ప్రేమ - తలచదు అపకారమును

3.  దుర్నీతిలో గాక - సత్యాన సంతోషించున్
    అన్నిటిని తాళుకొను ప్రేమ
    అన్నిటినమ్మియోర్చెడి ప్రేమ - అన్నిటి నిరీక్షించున్

4.  నిలుచును విశ్వాసము - నిరీక్షణయు మరి ప్రేమ
    వీటిలో శ్రేష్టమైనది ప్రేమ
    ప్రేమను కల్గియుండుటకు - ప్రయత్నించుడి మీరు

5.  ప్రేమలేనివాడు - దేవుని ఎరుగనివాడు
    మన దేవుడు ప్రేమస్వరూపి
    తన ప్రేమ మనలో సంపూర్ణ - సిద్ధిని పొందవలయు

6.  నిన్నడుగుచున్నాడు - నిను ప్రేమించిన ప్రభుయేసు
    నన్ను ప్రేమించుచున్నవా?
    వీరికంటె నా పై నీకు - ఎక్కువ ప్రేమగలదా?

7.  నను ప్రేమించినయెడల - నాయాజ్ఞలను గైకొనుము
    మీలో మీరు ఒకరినొకరు
    ప్రేమించుకొనుచున్న ఎడల - అదియే మహాదానందం

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------