3131) శాశ్వతము కాదు ఈ లోకము నా గమ్యము ఆ పరలోకము

** TELUGU LYRICS **

శాశ్వతము కాదు ఈ లోకము
నా గమ్యము ఆ పరలోకము (2)
నా గమ్యస్థానము నా యేసుని యందే
యుగయుగములకు ప్రభుతో వసియింతును (2) 
||శాశ్వతము కాదు||

స్థలమును సంసిద్ధము చేయుటకు
వెళ్ళాడు నా కొరకే ప్రభు యేసుడు (2)
నా తండ్రి గృహముకు నను చేర్చడానికి
వస్తాడు వేగమే నను కొనిపోవుటకు (2) 
||శాశ్వతము కాదు||

ఆవిరి వంటిది ఈ జీవితం
ఏ క్షణమో తెలియదుగా నా అంతము (2)
నా ప్రియుడు నా కొరకై రాబోయే దినమో
ప్రేమతో తన ఇంటికి నను పిలిచే క్షణమో (2) 
||శాశ్వతము కాదు||

నా ప్రభుని ఇంటిలో నాకు ఎప్పుడూ
సంతోషమే సమాధానమే (2)
ఈ లోక యాత్ర ముగిసిన వేళ
నా తండ్రి రొమ్మున నేనుందును (2) 
||శాశ్వతము కాదు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------