** TELUGU LYRICS **
సార్వజగతికి సంరక్షకుడు స్వామి యెహోవాయే గాద ధారుణీ స్థలిని
ధనధాన్యములనుఁ దొలి దానము తనకీయగరాదా
||సార్వజగతికి||
1. ఆదామును ప్రభు ప్రథమ ఫలంబుగ ఆదర్శముగాఁ మనకిడెగా ఆది
సంభవుని కతి మోదంబున సేద్య ఫలంబులు తేవలదా
||సార్వజగతికి||
2. కానుకలీయరె మానితులారా కన్యకుమారుని భజియింపన్ మానవ
పున్రుత్థాన మహిమలో మన ప్రథమ ఫలంబతడౌర
||సార్వజగతికి||
3. ఉభయజగాల సర్వోన్నతు డాయనే శుభకరు డన నొప్పును గాదె
ప్రభుని పేర పరమోత్తమమౌ ప్రథమ ఫలాదులు యిటతేరె
||సార్వజగతికి||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------