2952) రోజంతా నీ పాద చెంత నేనుండ నా కోరిక

** TELUGU LYRICS **

    రోజంతా నీ పాద చెంత నేనుండ నా కోరిక
    దినమెల్ల నా తోడుగా నీవుంటే ఓ వేడుక

1.  నిను చూసే కనులు స్తుతించే గళము
    ప్రేమించే హృదయము స్పందించే మనసు
    దేవా నీవే దయచేయుము
    నిన్ను కీర్తింప నేర్పు ప్రభు (2)
    జీవితాంతము నీ వాడిగానే
    నేనుండ నా కోరిక
    ప్రతి నిత్యం నీ రూపమే
    నా మదిలో మెదలాలిక

2.  నీ సైనికుడనై నే పోరాడెదను
    నా శక్తంతయు నా యుక్తంతయు
    నీకై వెచ్చింప సంసిద్ధుడను
    నన్ను దీవింప పంపు ప్రభూ (2)
    అతి త్వరలో జనులెల్లరు
    నిన్నెరుగ నా కోరిక
    ఒకమారు వారందరును
    నిను పొగడ చూడాలిగా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------