2867) రండి యుత్చాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే

** TELUGU LYRICS **

    రండి యుత్చాహించి పాడుదము - రక్షణ దుర్గము మన ప్రభువే

1.  రండి కృతజ్ఞత స్తో్త్రముతో - రారాజు సన్నిధి కేగుదము
    సత్ప్రభునామము కీర్తనలన్ - సంతోష గానము చేయుదము
    ||రండి||

2.  మన ప్రభువే మహదేవుండు - ఘన మహత్మ్యము గల రాజు
    భూమ్యాగాధపు లోయలును - భూతల శిఖరములాయనవే
    ||రండి||

3.  సముద్రము సృష్టించె నాయననే - సత్యుని హస్తమే భువిఁ జేసెన్
    ఆయన దైవము పాలితుల - ఆయన మేపెడి గొఱ్ఱెలము
    ||రండి||

4.  ఆ ప్రభు సన్నిధి మోకరించి - ఆయన ముందర మ్రొక్కుదము
    ఆయన మాటలు గైకొనిన - నయ్యవి మీకెంత మేలగును
    ||రండి||

5.  తండ్రికుమార శద్ధాత్మకును - దగుస్తుతి మహిమలు కల్గుగాక
    ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు - నయినట్లు యుగములనౌను ఆమేన్
    ||రండి||

** ENGLISH LYRICS **

Randi Uthsahinchi Paadudamu - Rakshana Dhurgamu Mana Prabhuvae

1. Randi Kruthagnatha Sthothramutho - Raaraaju Sannidhi Kaegudhamu
Sathprabhu Naamamu Keerthanalan - Santhosha Gaanamu Chaeyudhamu
||Randi||

2. Mana Prabhuvae Mahadhaevundu - Ghana Mahaathmyamu Gala Raaju
Bhoomyaagaadhapu Loyalunu - Bhoothala Shikharamulaayanavae
||Randi||

3. Samudhramu Srushtinche Naayananae - Sathyuni Hasthamae Bhuvi Jaesen
Aayana Dhaivamu Paalithula - Aayana Maepedi Gorrelamu
||Randi||

4. Aa Prabhu Sannidhi Moakarinchi - Aayana Mundhara Mrokkudhamu
Aayana Maatalu Gaikonina - Nayyavi Meekentha Maelagunu
||Randi||

5. Thandri Kumaara Shuddhaathmakunu - Dhagusthuthi Mahimalu Kalgu Gaaka
Aadhini Ippudu Nellappudu - Nayinatlu Yugamulanounu Amen
||Randi||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------