2895) రక్షణ్య పాటలు పాడి రక్షకుడేసును సదా కొనియాడు

** TELUGU LYRICS **

    రక్షణ్య పాటలు పాడి
    రక్షకుడేసును సదా కొనియాడు
    అను పల్లవి: ఇక్కట్టులోన యేసును విదకి
    ఎక్కాలమందున స్తుతించ కూడి

1.  అంధకారము నుండి విడిపించి
    అమర్త్యుడేసుని రాక్యము జేరి
    అన్నియు నొసగు దేవుని జేరి
    పెన్నుగ ప్రభును మహిమపరచి

2.  అగ్ని నుండి తీసి కొరవిని
    విఘ్నము లేక బైట వేసి
    కపట వేషము పారద్రోలిన
    ప్రాపుకు డేసగు వేకువ చుక్కను

3.  భయంకర పాపకూపము నుండి
    బురదలో నుండి పైకిలాగి
    కాళ్ళను బండమీద నిలిపి
    పాదములను స్థిరపరచిన యట్టి

4.  మరణము నుండి తప్పించినట్టియు
    తత్కాలమున తప్పించుచున్న
    ఇక ముందును తప్పించునను
    గొప్ప నమ్మకమును మనకిచ్చిన

5.  సంకటములనుండి విడిపించి
    వణకును మనకెడబాటు చేసిన
    కష్టపెట్టిన బాధల తొలగించి
    విడిపించినట్టి యేసును చూచి

6.  శ్రమల నెల్లను పారద్రోలి
    శోధనలు మనలను జేరకను
    సుఖముల మా కెల్లప్పుడు నిచ్చిన
    ప్రేమ స్వరూపిని స్తోత్రించుచును

7.  దుష్టలోకము నుండి మనలను
    లోకాధిపతి సైతాను నుండి
    పిసాచి యధికారములో నుండి
    విడిపించిన ప్రభునకు హల్లెలూయ

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------