** TELUGU LYRICS **
రజతోత్సవంబు నేడు నా యేసు రాజా
భజియింతుమయ్యా నిన్నే ఓ దివ్య తేజా
యీ మందిరంబు నందు నిలచియుండుమయ్యా
మా మదిని సంతసంబు వనగూర్చుమయ్యా
భజియింతుమయ్యా నిన్నే ఓ దివ్య తేజా
యీ మందిరంబు నందు నిలచియుండుమయ్యా
మా మదిని సంతసంబు వనగూర్చుమయ్యా
||రజతోత్సవంబు||
1. కల్వరి దేవాలయమును కట్టించి యిచ్చావు
సిలువ సువార్తను చాటింప నిలిపావు
నీ కార్యములు ఎంతో బలమైనవి దేవా
మా కొరకు మనుజునిగా జనియించినావయ్యా
1. కల్వరి దేవాలయమును కట్టించి యిచ్చావు
సిలువ సువార్తను చాటింప నిలిపావు
నీ కార్యములు ఎంతో బలమైనవి దేవా
మా కొరకు మనుజునిగా జనియించినావయ్యా
||రజతోత్సవంబు||
2. యిరువది అయిదేండ్లు మాకు తోడుగా వుంటువి
కరువైన కాటకమైన ఆదరించి నడిపితివి
నీ ప్రేమ మరువగలేము మాపాలిదైవమా
మా ప్రార్ధనాలించి మా స్తుతులు గైకొనుమా
2. యిరువది అయిదేండ్లు మాకు తోడుగా వుంటువి
కరువైన కాటకమైన ఆదరించి నడిపితివి
నీ ప్రేమ మరువగలేము మాపాలిదైవమా
మా ప్రార్ధనాలించి మా స్తుతులు గైకొనుమా
||రజతోత్సవంబు||
3. నీ అద్బుతంబులిచట జనులు చూడ జరిగించు
నీ ఆత్మతో నింపి నిన్ను గొల్వ నడిపించు
ఆత్మీయత ఆనందం సంఘములో పండించు
నీతియని వాక్యముతో మమ్మునెల్ల స్థిరపరచు
3. నీ అద్బుతంబులిచట జనులు చూడ జరిగించు
నీ ఆత్మతో నింపి నిన్ను గొల్వ నడిపించు
ఆత్మీయత ఆనందం సంఘములో పండించు
నీతియని వాక్యముతో మమ్మునెల్ల స్థిరపరచు
||రజతోత్సవంబు||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------