2922) రాజులరాజు ప్రభువుల ప్రభూ ఈ జగతికి అరుదెంచె ప్రభూ

** TELUGU LYRICS **

    రాజులరాజు - ప్రభువుల ప్రభూ
    ఈ జగతికి - అరుదెంచె ప్రభూ

1.  ప్రభావంపు దూతలతోడ - ప్రభువేతెంచున్ అగ్ని జ్వాలలలో
    ఆ దినమున పవిత్ర జనమున - మహిమాశ్చర్యకరుడగు ప్రభు

2.  ప్రభు యేసు తానే స్వర్గమునుండి - ఆర్భాటముతో పిలుచుచు వచ్చున్
    ప్రభు జీవితులను మృతులైన వారిని - దేవుని ప్రజలను తనచెంతన్ జేర్చున్

3.  ధన్యులు ప్రభుకై జూచెడివారు - మిన్నున ప్రభుతో కలిసి వెళ్ళెదరు
    విశ్వాసులను ప్రేమతో ప్రభువు - ఆహ్వానించును తన సన్నిధికి

4.  అనంత జీవము నీకిచ్చును - ఘనత మహిమ ప్రభు నీకిచ్చున్
    తండ్రితో నిన్ను జేర్చును ప్రభువు - జీవ కిరీటము నీకిచ్చును

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------