2978) లోకమును జయించిన విజయము విశ్వాసమే

** TELUGU LYRICS **

    లోకమును జయించిన విజయము విశ్వాసమే - 
    ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే
    విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే (2)
    లోకమును జయించిన విజయము విశ్వాసమే - 
    ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే... హే

1.  ఆవగింజంత విశ్వాసం - నీలో ఉంటే .... (హే) (2)
    కొండలైనా కదులును - సంద్రమైన చీలును
    గాలైన అణగి దెయ్యమైనా వదలి - యేసునకే మహిమ తెచ్చును
    విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే 
(2)
    లోకమును జయించిన విజయము విశ్వాసమే 
    ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే... ఏ

2.  నమ్మిన నీవు దేవుని - మహిమ చూస్తావు ... (హూ) (2)
    మృతులను లేపెడి - యేసు రాజే జీవము
    మృతమైన లోక జనులను లేప - యేసు వలే సాగి పోవుదాం
    విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే 
(2)
    లోకమును జయించిన విజయము విశ్వాసమే 
    ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే.... హే

3.  లేని వాటిని ఉన్నట్టు - పిలుచును ప్రభువు..... (హూ ) (2)
    విశ్వసించి పలుకుదాం - క్రియలను చూపుదాం
    జీవవాక్కు పలికి ఆత్మ శక్తి చూపి - గొప్ప గొప్ప పనులు చేయుదాం
    విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే 
(2)
    లోకమును జయించిన విజయము విశ్వాసమే 
    ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే

4.  నమ్ము వానికి సమస్తం - సాధ్యమే ప్రభుతో ..... (హో) (2)
    ప్రభువు ఉన్నాడని - ఫలము ఇస్తాడని
    నీకై ప్రాణం పెట్టి మృతి గెల్చాడన్న వార్త నమ్ము- నీదె జీవం
    విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే 
(2)
    లోకమును జయించిన విజయము విశ్వాసమే 
    ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే... హే

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------