** TELUGU LYRICS **
లోకమునకు నన్ను - దేవా నా దేవా
ఉప్పుగా జేసితివి - అద్భుత దేవా నా దేవా
ఉప్పుగా జేసితివి
ఉప్పుగా జేసితివి - అద్భుత దేవా నా దేవా
ఉప్పుగా జేసితివి
1. నరరూపధారి - పరలోక ఉప్పయి
ఘోరపాపినైన నన్ను - శుద్ధీకరించితివి
ఘోరపాపినైన నన్ను - శుద్ధీకరించితివి
2. యెరికో నీళ్ళ - వలె నా జీవం
మరణచేదై యుండ నీవు - రుచిగా మార్చితివి
మరణచేదై యుండ నీవు - రుచిగా మార్చితివి
3. నా రోతహృదయం - నూతన పరచి
పరమ ఉప్పుతోడ నీవు - నింపిన దేవుండవు
పరమ ఉప్పుతోడ నీవు - నింపిన దేవుండవు
4. పరులకు యిలలో - ప్రభు క్రీస్తు రుచిన్
నిరతమునే జూపునట్లు - కుమ్మరించుము నన్ను
నిరతమునే జూపునట్లు - కుమ్మరించుము నన్ను
5. నీ నిత్యజీవం - నీ సంతోషం
నిత్య సమధానమిచ్చి - భద్రపరచితివి
నిత్య సమధానమిచ్చి - భద్రపరచితివి
6. దీనుడనై నే - బహుదుఃఖపడిన
ఎన్నడైన విడువక శ్రేష్ట - ఉప్పుగా మర్చుచున్న
ఎన్నడైన విడువక శ్రేష్ట - ఉప్పుగా మర్చుచున్న
7. జనులు నన్ను హింసించినపుడు
ఎన్ని చెడ్డమాటలన్న - హల్లెలూయ పాడెదన్
ఎన్ని చెడ్డమాటలన్న - హల్లెలూయ పాడెదన్
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------