3481) హల్లెలూయ పాడుడి హల్లెలూయ పాడుడి

** TELUGU LYRICS **

    హల్లెలూయ పాడుడి - హల్లెలూయ పాడుడి
    హల్లెలూయ పాడుడి - హల్లెలూయ పాడుడి
    హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
    హల్లెలూయ పాడుడి - హల్లెలూయ పాడుడి

1.  క్రీస్తు మనకు రక్షణ నొసగెన్ విడిపించె మనల తనదు రక్తముతో
    గొప్పదైన నిజమైన అద్భుత రక్షణ యిదే
    అందుకొరకై పాడుడి - హల్లెలూయ పాడుడి

2.  మహిమ దర్శన మనుగ్రహించె పరమ వైభవమును చూపించె
    మహిమ ఘనత స్తుతి ప్రభావములన్నియు ఆయనవే
    అందుకొరకై పాడుడి - హల్లెలూయ పాడుడి

3.  ఘనపరచుడి సజీవ క్రీస్తున్ జీవితములో జూపుడాయనన్
    ధనికులుగ మనలను ప్రేమతో తానే జేసెన్
    అందుకొరకై పాడుడి - హల్లెలూయ పాడుడి

4.  నిత్యమగు తన శక్తితో కాయున్ ప్రభు శరణు జొచ్చిన వారిన్
    అధిక జయం సాహసమున్ అన్నియు మనవాయెన్
    అందుకొరకై పాడుడి - హల్లెలూయ పాడుడి

5.  ఏమి వచ్చినన్ జీవితయాత్రలో - ఆమెన్ అనుచు సహించెదము
    శ్రమలలోనే శాంతి యుండున్ - అద్భుత యానందము
    అందుకొరకై పాడుడి - హల్లెలూయ పాడుడి

6.  దేవునికి భయపడు వారలారా చిన్నలైన మీరు పెద్దలైనను
    ఆయనకే యుగములందు స్తుతి చెల్లును గాకని
    మీరందరు పాడుడి - హల్లెలూయ పాడుడి

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------