3563) గతకాలమంతా కాచి నీ మేలులెన్నో చేసితివి

** TELUGU LYRICS **

    గతకాలమంతా కాచి నీ మేలులెన్నో చేసితివి (2)
    నీ చుట్టె కంచెను మా చుట్టూ ఉంచి  నీ వాత్యల్యము చూపితివి (2)
    మా బలము నీవే - మా భాగ్యము నీవే - మా దాగుచోటు నీవే యేసయ్యా (2)

1.  సీయోను కొండలపై హెర్మోను మంచువలే  నీదీవేనలు మాపై కురుపించితివి (2)
    నీసన్నిధిలో స్తుతించు చుండగా మా గిన్నె నిండి పొర్లుచున్నది (2)
    నీ మహిమైశ్వర్యములో మా ప్రతి అవససము యెహోవా యీరే గా చూచుకొంటివి  (2)
    మా బలము నీవే - మా భాగ్యము నీవే - మా దాగుచోటు నీవే యేసయ్యా (2)  
    ||గత||

2.  మా సరిహద్దులలో సమాధానమునిచ్చి మంచి గోధుములతో మము తృప్తి పరచితివి (2)
    దినములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుచుంటివి (2)    
    నీ నీతి మార్గమున మేము నడువగా యెహోవా షాలోమ్ మై మాతో నడచితివి  (2)
    మా బలము నీవే - మా భాగ్యము నీవే - మా దాగుచోటు నీవే యేసయ్యా (2) 
    ||గత||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments