1988) ప్రకాశ వస్త్రముతో పరలోక మహిమతో

** TELUGU LYRICS **

    ప్రకాశ వస్త్రముతో పరలోక మహిమతో
    లోకంబున కేతెంచును మేఘంబుపై ప్రభువే

1.  అంత్య సూచనలు చూడుము - ప్రభు రాకకు మునుపు
    క్రీస్తు నిశ్చయముగా వచ్చును - బూర శబ్దముతో
    విస్తరించు లోకమందు - యుద్ధము కరవులు
    విస్తరించు పాపములు దుహ్ఖము కలవరము

2.  పాపముచే జన్మించిరి - తల్లి గర్భమునుండి
    కోపము దుష్టమోసము - ఎల్లరి హృదయములు
    పాప దృష్టి జారచోర - దేవదూషణ హత్యలు
    వేపుగా దుష్టగర్వముల్ - హృదయ రోగములు

3.  వెళ్ళరు పరలోకమునకు - ఎవ్వరు పాపముతో
    చాలవు నీతి క్రియలు - ప్రార్థనలు రక్షింపవు
    చాలును యేసు రక్షింప - ప్రాణమర్పించెను
    కలుషములు కడుగును - తన రక్తము చిందించె

4.  క్షణములోనే గతించును - జీవిత మేపాటిది
    తన యాస్తి విడచి నరుడు - నరకము పాలగున్
    నిన్ను రక్షింప నీ ప్రభు - సిద్ధముగ నిలిచె
    పెన్నుగ పొందుము రక్షణ - నమ్మి యేసు ప్రభువులో

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------