2034) ప్రభుయేసు రమ్మనుచుండె పాపుల నెల్లరిని

** TELUGU LYRICS **

    ప్రభుయేసు రమ్మనుచుండె - పాపుల నెల్లరిని
    వచ్చిన వారికి ప్రభుయేసుండే - విశ్రాంతి నిచ్చు

1.  లోకములో మానవులెల్ల ఘోరపాపములు జేసి
    దేవుని మహిమకు దూరమైపోయిరి
    మానవుల నీతి క్రియలు - మురికి పేలికలే

2.  ప్రభు యేసుక్రీస్తు నందు ఏ పాప దోషము లేదు
    మ్రానుపై వ్రేలాడెనుగా మన దోషముల కొరకై
    మరణము గ్లెచి విజయమునిచ్చి - నీతిగా తీర్చె

3.  ఎందరు విశ్వసింతురో ప్రభువైన యేసుని
    వారే పొందెదరుగా నిత్యమైన రక్షణ
    నేడె మీ కనుకూల సమయము - రక్షణ దినము

4.  పాపమును క్షమించుటకు - ప్రభుకే అధికారము కలదు
    ఎవరి పాపదోషములు - పరిహరింపబడునో
    వారే ధన్యులు పరలోకములో నిశ్చయముగా

5.  పరలోకపు తండ్రికి పుత్రులు విశ్వసించిన వారెగా
    తీర్పు మరణము లేక జీవము పొందెదరు
    పరిపూర్ణులుగా కడుగ బడుడి యేసుని రక్తములో

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------