2073) ప్రభువు దిగివచ్చును పరమునుండి వేగమే

** TELUGU LYRICS **

    ప్రభువు దిగివచ్చును పరమునుండి వేగమే
    విభుడు తిరిగివచ్చును పరమ వధువుకై

1.  ప్రభువు దిగివచ్చు నార్భటముతో - దూత శబ్దముతో బూరధ్వనితో
    క్రీస్తునందు మృతులు మొదటనే లేతురు
    వారితో నేకమై ప్రభువు నెదుర్కొందువా?

2.  వాని వాని పనులనుబట్టి ప్రభువు - సిద్ధపరచిన జీతము తానిచ్చును
    తానే త్వరగా వచ్చున్ ఎదుర్కొన సిద్ధమా
    సిగ్గుతో భయముతో నుందువా దినమునా?

3.  హృదయములో కలవరపడక - క్రీస్తునందు విశ్వాసముంచుడి
    శుద్ధులుగ మీరు సిద్ధమనస్సుతోడ
    ప్రార్ధన చేయుచు మేల్కొని యుండుడి

4.  అనేకుల పాపములను భరింప - ఒక్కసారే క్రీస్తు అర్పించుకొనెను
    తనకొరకై వేచియుండు వారికొరకు
    పాపరహితుడు తిరిగి ప్రత్యక్షమౌ

5.  ప్రొద్దు గ్రుంకి వచ్చునో ఎప్పుడో అర్థరాత్రియో తెల్లవారు ఝామునో
    నిద్దుర పోవుచునుండగా వచ్చునో
    మేల్కొనియుండుడి మీరు ఎల్లప్పుడు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------