** TELUGU LYRICS **
ప్రభువా పరలోక - జీవాగ్ని నిమ్ము
పరిపూర్ణముగా - జీవము నిమ్ము
పావనాత్మాగ్నిని - నాలో జ్వలింపగ
పరిశుద్ధ జీవము - పూర్తిగ నిమ్ము
1. నిను హృదయంబార - ప్రేమించునట్లు
నింపుము నా మది - ప్రేమాగ్నితో
సర్వము హృదయము - కాయము నిచ్చెద
స్వర్గీయ జీవ సమృద్ధి నిమ్ము
2. యేసు స్తుతి నే పాడునట్లు
ఆశనొసగుము - నా హృదయములో
నన్నుండి జీవము - ప్రవహించునట్లు
నీలో సంతృప్తిగ త్రాగెదను
3. ప్రశస్తరక్తమున - కడుగుము
పాప మృత్యువు నుండి విడిపించుము
సింహాసనం నాలో స్థాపించి
వాగ్దానము నెరవేర్చుము నాలో
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------