** TELUGU LYRICS **
ప్రభురాజ్యం నిశ్చలమైనది
శుభప్రదంబు శాశ్వతమైనది
శుభప్రదంబు శాశ్వతమైనది
1. పృథివినందు వున్న వన్నియు - కదలి గతించి పోవుచున్నవి
గతించదు నీ వాక్యమెప్పుడు - ఖ్యాతిగాను నిలుచునెప్పుడు

2. జనాంగములు కదలుచున్నవి - జగమందెల్లను శాంతియేలేక
ప్రభుని ప్రజలు స్థిరులై యుందురు - విభుని ప్రజలు నిత్యముండెదరు

3. భూమి ఆకాశముల్ కదలింపబడును - అంతరించి తరలిపోవున్
ప్రభుని గృహము కదలదెన్నడు - విభుని యిల్లు నిత్యమునిలుచున్

4. ఉదయించునుగ రాజ్య మొకటి - పొడిచేయునుగ అన్యరాజ్యములన్
ఆ రాజ్యం అంతరించదు - ఆ రాజ్యం నిత్యము నిలుచున్

5. తన ప్రజలకు రాజ్యము నొసగన్ - ఘనుడగు తండ్రి కోరిక యిదియే
ప్రభు ప్రేమ చలించనేరదు - ప్రభు ప్రేమ నిలుచు నిరతం

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :