2003) ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనముత్సహించెదము

    ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనముత్సహించెదము
    ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించె నహా
    అను పల్లవి: ఆహా స్తోత్రము స్తోత్రములు - ఇంతవరకు కాచె
    పాత్రులముగా సేవింతుము

1.  దైవ కార్యములు జనముల మధ్య - ప్రసిద్ధి చేయుదము
    దేవుని ఆశ్చర్య కార్యము మనలో - ధ్యానించి పాదెదము

2.  సంగీత గానములతోను - సన్నుతించుచు ప్రభుని
    సితార స్వరమండలములతో - మన మార్భాటించెదము

3.  మన భారములన్నియు తొలగించె - ఘనకార్యములను జేసె
    దినమెల్ల పాడుచు ఘనపరచెదము - చాటించెద మిలలో

4.  నూతన కార్యములు చేయువాడు - ప్రభు వాశ్చర్యకరుడు
    బలమగు కార్యములు చేయువాడాయనే ధైర్యముగా పాడెదం

5.  ప్రేమా సౌందర్యములు గలవాడు - క్షేమము నిచ్చువాడు
    మహిమైశ్వర్యములు గలవాడాయనే మహిని బొగడెదము

6.  మనకెన్నో వాగ్దానము లిచ్చె మన మనుభవించితిమి
    ఘనతా మహిమ ప్రభావము ప్రభునకే హల్లెలూయా ఆమెన్