2163) పూర్వమాశీర్వాదము నేడు శ్రీయేసే

** TELUGU LYRICS **

1.  పూర్వమాశీర్వాదము - నేడు శ్రీయేసే
    మున్ను నా యాలోచన - నేడు తనమాట
    మున్ను వరము కోరితి - నే డేసగు వానిన్
    మున్ను స్వస్థత కోరితి - నేడు వానినే
    పల్లవి: సర్వములో సర్వదా - యేసునే పాడెద
    యేసులో సమస్తము - సమస్తము యేసే

2.  మున్ను శోధన శ్రమ - నేడు నమ్మకం
    ముందు అర్థరక్షణ - నేడు సంపూర్ణం
    మున్ను విడువనిపట్టు - నేడేసు నన్ బట్టెన్
    పూర్వము నే నస్థిరం - నేడు - స్థిరమైతి

3.  మున్నునా ప్రయత్నము - నేడు ప్రార్థన
    పూర్వమెంతో జాగ్రత్త - నేడతని శ్రద్ధ
    మున్ను నాదుకోరిక - నేడేసుమాట
    పూర్వ మడుగుచుండుట - నేడు సంస్తుతి

4.  మున్ను నాపనియది - యికను తన పని
    మున్ను తనను వాడితిన్ - నేడు నన్ వాడును
    మున్ను శక్తి కోరితిన్ - నేడు శక్తునే
    మున్ను నాకై చేసితిన్ - నేడు తనకే

5.  మున్ను యేసును కోరితిన్ - నా వాడాయె నేడు
    మున్ను జ్యోతులుగ నుండే - నే డేంతో కాంతి
    మున్ను చావు గోరితి - నేడు తన రాకన్
    నా నిరీక్షణలెల్ల – స్థిరమాయెను

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------