2164) పెళ్లంటే దేహములు వేరైనా

** TELUGU LYRICS **

    పెళ్లంటే దేహములు వేరైనా – ఒక్కటిగ ఫలియించె దైవ సంకల్పం
    దైవమె తన చిత్తముగా – చేసెనే ఘనమైనదిగా
    ముడిపడే దృఢమైనదిగా – విడిపడే వీలు లేనిదిగా
    కలలకే సాకారముగా – ఒకరికొకరు ఆధారముగా
    తల్లి స్థానంలో భార్యనుగా – తండ్రి స్థానంలో భర్తనుగా
    నాదనే స్వార్ధము విడగా – మనదనే బంధము జతగా
    ప్రతిదినం తీగలో లతగా – అల్లుకుపోయే చందముగా.. ఆ..
    పెళ్లంటే దేహములు వేరైనా – ఒక్కటిగ ఫలియించె దైవ సంకల్పం
    పెళ్లంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే – గొప్ప అవకాశం
    ఇహలోకాలలో శూన్యం ఉండగా – దైవం తలచినా
    బంధం పెళ్లిగా మారెనుగా ! 
    ||పెళ్లంటే||

1.  రెండుకళ్ళ వేరువేరు – శిరమునందు వేరుపారు
    దృశ్యమేది చూపిస్తున్నా – చూపులు రెండు జతగా చేరు
    రెండు కాళ్ళు వేరు వేరు – ఒక్క పధము నందు చేరు
    అడుగు ముందు వెనుకవుతున్న – గమ్యం మాత్రం కలిసే చేరు
    ఇరువురొక్కటై – ఏక దేహమై
    దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా
    దేహ సుఖముకే – మనువు కొరక
    దేవతనయులను పెంచాలని – దైవం నియమించెనుగా
    ఆదిబంధమే ఆలుమగలుగా
    అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా!
    ||పెళ్లంటే||

2.  వరుని కొరకు వధువు సంఘము – సిద్ధపరచబడితే అందము
    ఏకదేహమంటే అర్ధము – క్రీస్తుతో సంఘము అనుబంధము
    లోబడుటయే వధువుకు ఘనము – వరుని ప్రేమ వధువు స్వాస్థ్యము
    కళంకము ముడతలు లేని – పవిత్రమైన ప్రభువు శరీరము
    తనకుతానుగా వదువుకోసమే – సమస్తమును అర్పించిన ప్రియ వరుడే ప్రాణప్రియుడు
    మోసగించక మాటదాటక – వరుని అడుగు జాడలో నడిచే ప్రాణేశ్వరి ఆ వధువు
    గొప్పదైన ఆ.. పెళ్ళిమర్మము – క్రీస్తు వదువుకే సాదృశ్యము ఛాయారూపము!
    ||పెళ్లంటే||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------