1964) పరిశుద్ధులెల్లరు యేసున్ పొగడి

** TELUGU LYRICS **

1.  పరిశుద్ధులెల్లరు యేసున్ పొగడి - పాడి యార్భటించి పరముననుండ
    పరమానంద గీతమచ్చట ధ్వనింప - నీ వచట నుందువా? (3) నా మానసమా!

2.  గొర్రెపిల్లయు రాజ్యమేలుచుండ - నాశ్రితు లెల్లరు నాయనను చేర
    మిత్రుడెల్ల కన్నీటి దుడుచుచుండ - నీ వచట నుందువా? నా మానసమా!

3.  పేతురు పౌలు యోహాను నచట - పితామహులు యపొ స్తలులందరు
    హతసాక్షులెల్లరు సమావేశింప - నీ వచట నుందువా? నా మానసమా!

4.  జగములో సిలువను మోసినచో - కిరీటము ధరియించి భాసిల్లుదురు
    దేవ పుత్రులుగా నెల్లరు మారగా - నీ వచట నుందువా? నా మానసమా!

5.  శోధనల జయించిన వీరులెల్ల - కష్టశ్రమలోర్చిన మహాత్ములు
    జ్యోతిర్మయులుగా నొప్పారుచుండ - నీ వచట నుందువా? నా మానసమా!

6.  కన్యకరణినాడు ప్రభుసంఘము - రాజు యేసు పెండ్లి కుమారునికి
    భార్యగా ప్రకాశింప దాని రుచింప - నీ వచట నుందువా? నా మానసమా!
    నేనచట నుండెదను నా యేసుతోడ

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------