1949) పరిశుద్ధాత్మను గోరుము జీవము యేసు ప్రభుని పేరట వేడుము

** TELUGU LYRICS **

    పరిశుద్ధాత్మను గోరుము జీవము యేసు ప్రభుని పేరట వేడుము
    నరు లందరి మీఁద నా యాత్మ నుంతు నని పరలోకపు తండ్రి పలికె
    వేదమునందు 
    ||పరిశుద్ధాత్మను||

1.  పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠన పఠనము గాదది నెర చీఁక
    టింట సర కులు వెదకు రీతి ప ల్మరు వెదకినను నిర ర్థకమై పోవును
    వేగఁ
    ||పరిశుద్ధాత్మను||

2.  పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చందంబే యది పరబోధక
    ముల వ ర్తిమైన పనులు జీ వ రహితములై యను భవము గానివై
    యుండుఁ
    ||పరిశుద్ధాత్మను||

3.  పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని నెఱుఁగు టెఱఁగుట గాదది నర
    రూపుఁ దాల్చి దు ర్నరుల రక్షణకొరకు మరణ మొందిన ప్రభుని
    కరుణాధికము వడయఁ
    ||పరిశుద్ధాత్మను||

4.  పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకుగాదది దురితేచ్ఛ
    లను గొప్ప యురులం దగిలి భక్తి తరిగి పోవుట కద్ది దొరకనందున
    మమ్ము
    ||పరిశుద్ధాత్మను||

5.  పరిశుద్ధాత్మను బొందుట అన్నిటి కన్నఁ ప్రబలంబైన మేలిట నెర
    నమ్మి మొఱబెట్టు పరమ పావనఁ డద్ది కరుణించి నీ కొసఁగు మరణాంత
    మగు దనుక
    ||పరిశుద్ధాత్మను||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments