1900) పరమతండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము (147)

    - Scale : E

    పరమ తండ్రి కరములెత్తి - స్తుతుల నర్పింతుము
    శిరములెత్తి స్వామి నీకై - చూచుచుంటిమి
    ఉజ్జీవ నాత్మ నొసగు నిలువ - సజీవ సాక్షిగ

1.  పాప శాపములందు మేము - పడి చెడి యుండగా
    దేవ మాదు దరికి జేరి - లేవ నెత్తితివి
    ఎంత జాలి ఎంత ప్రేమ - స్తుతుల నర్పింతుము

2.  దినదినము నిను శోధించి - దుఃఖ పెట్టితిమి
    కేవలము శరీరులమని - కనికరించితివి
    క్షమించి మమ్ము కడిగితివి - స్తుతుల నర్పింతుము

3.  నింద వేదన శ్రమలు బహు - నిట్టూర్పులయందు
    విసుగకుండ సేవచేయ - నొసగు నోర్పును
    నింపు నీ శుద్ధాత్మతోను - స్తుతుల నర్పింతుము

4.  సూర్యచంద్ర తారలందు - వింత సూచనలు
    జరుగ జనులు ధైర్యము చెడి - కూలి చూచెదరు
    అయితే నీకై చూచు మేము - బలము నొందెదము

5.  సమాజముగ కూర్చి నీదు - సన్నిధియందు
    ప్రార్థన సహవాసములలో - స్థిరులజేయుము
    తేరి చూస్తూ నీ రాకడకై - స్తుతుల నర్పింతుము

6.  శత్రుటురులు త్రుంచివేసి - జీవమిచ్చితివి
    ఆహా! యేమర్పింతుము - నీ ఉపకారములకై
    చేతబట్టి రక్షణపాత్ర - స్తుతుల నర్పింతుము

7.  గతబ్రతుకులో వాత్సల్యమున - గాచి యీ క్షితిన్
    నడిపె నవ్యవత్సరముకై - కృపాక్షేమములతో
    సత్యుడ సిల్వశక్తి నొసగు - సాగముందుకు

CHORDS

    E     F#m B            E    
    పరమ తండ్రి కరములెత్తి - స్తుతుల నర్పింతుము
        F#m    B            B7        E
    శిరములెత్తి స్వామి నీకై - చూచుచుంటిమి
            F#m   B              B7      E
    ఉజ్జీవ నాత్మ నొసగు నిలువ - సజీవ సాక్షిగ

                    F#m         B   B7        E
1.  పాప శాపములందు మేము - పడి చెడి యుండగా
                 A         B7        E
    దేవ మాదు దరికి జేరి - లేవ నెత్తితివి
    C#m7 F#m A    E    F#m    B7      E
    ఎంత జాలి ఎంత ప్రేమ - స్తుతుల నర్పింతుము

2.  దినదినము నిను శోధించి - దుఃఖ పెట్టితిమి
    కేవలము శరీరులమని - కనికరించితివి
    క్షమించి మమ్ము కడిగితివి - స్తుతుల నర్పింతుము

3.  నింద వేదన శ్రమలు బహు - నిట్టూర్పులయందు
    విసుగకుండ సేవచేయ - నొసగు నోర్పును
    నింపు నీ శుద్ధాత్మతోను - స్తుతుల నర్పింతుము

4.  సూర్యచంద్ర తారలందు - వింత సూచనలు
    జరుగ జనులు ధైర్యము చెడి - కూలి చూచెదరు
    అయితే నీకై చూచు మేము - బలము నొందెదము

5.  సమాజముగ కూర్చి నీదు - సన్నిధియందు
    ప్రార్థన సహవాసములలో - స్థిరులజేయుము
    తేరి చూస్తూ నీ రాకడకై - స్తుతుల నర్పింతుము

6.  శత్రుటురులు త్రుంచివేసి - జీవమిచ్చితివి
    ఆహా! యేమర్పింతుము - నీ ఉపకారములకై
    చేతబట్టి రక్షణపాత్ర - స్తుతుల నర్పింతుము

7.  గతబ్రతుకులో వాత్సల్యమున - గాచి యీ క్షితిన్
    నడిపె నవ్యవత్సరముకై - కృపాక్షేమములతో
    సత్యుడ సిల్వశక్తి నొసగు - సాగముందుకు

No comments:

Post a Comment

Do leave your valuable comments