1930) పరలోకమే నా స్వాస్థ్యము ఎపుడు గాంతునో

** TELUGU LYRICS **   

    పరలోకమే నా స్వాస్థ్యము - ఎపుడు గాంతునో
    నా ప్రియ యేసుని - నేనెపుడు గాంతునో

1.  ఆకలిదప్పులు దుఃఖము - మనోవేదన లేదచ్చట
    పరమ మకుటము పొందను - ప్రభు పాదముల చేరెదను

2.  సిలువ వేయబడితిని - ఇక నేకాదు జీవించుట
    ప్రభు యేసు మహిమ కొరకు - గురి గలిగి జీవింతును

3.  నా పరుగు తుదముట్టింప - నాకు కృపను మెండుగ నొసగును
    విశ్వాస మార్గములో - విసుగక పరుగెత్తెదను

4.  పరమ విశ్రాంతి పొంద - పరలోకమందు చేరెదను
    పగలు రాత్రచ్చట లేదు - ప్రభువే దీపమై యుండును

5.  ప్రియుని పిలుపును విని - నేను కూడా సిద్ధపడెదను
    దినములు సమీపించగా - వాంఛయు అధికంబాయె

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------