1931) పరలోక రాజ్యము చేరుటకు ప్రభుయేసే మార్గంబు

** TELUGU LYRICS **

    పరలోక రాజ్యము చేరుటకు - ప్రభుయేసే మార్గంబు
    మార్గ సత్య జీవము నేనేయని యేసే పల్కెను

1.  సర్వలోకుల పాప - పరిహారార్థము శ్రీ యేసు
    పరిశుద్ధ రక్తము చిందించి - బలియాయెను శ్రీ యేసు

2.  పాపపరిహారార్థము - పావన రక్తము నిచ్చిన
    యేసుని చేర ప్రియుడా - సంశయమదియేల

3.  నిను ప్రేమించి ప్రాణము - నీకై పెట్టిన యేసుని
    నాకు వలదంచు వెళ్ళుట - న్యాయమా ప్రియుడా

4.  మరణించిన యేసు ప్రభువు - మూడవనాడు లేచెను
    మహిమా ప్రభావముతో యేసు - మరణము గెల్చెను

5.  తక్షణమే మారు మనస్సు - నొంది యేసును నమ్మిన
    రక్షణ నొందెదవు - నిశ్చయముగనో – ప్రియుడా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments