1894) పరదేశులమో ప్రియులారా మన పురమిది గాదెపుడు


** TELUGU LYRICS **

పరదేశులమో ప్రియులారా మన
పురమిది గాదెపుడు (నిజముగ) (2)        
||పరదేశుల||

చిత్ర వస్తువులు చెల్లెడి యొకవి
చిత్రమైన సంత (లోకము) (2) 
||పరదేశుల||

సంత గొల్లు క్షమ సడలిన చందం
బంతయు సద్దణగన్ (నిజముగ) (2)   
||పరదేశుల||

స్థిరమని నమ్మకు ధర యెవ్వరికిని
బరలోకమే స్థిరము (నిజముగ) (2) 
||పరదేశుల||

మేడలు మిద్దెలు మేలగు సరకులు
పాడై కనబడవే (నిజముగ) (2) 
||పరదేశుల||

ధర ధాన్యంబులు దరగక మానవు
పని పాటలు పోయె (నిజముగ) (2)   
||పరదేశుల||

ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికిన
మన్నై పోవునుగా (దేహము) (2) 
||పరదేశుల||

వచ్చితి మిచటికి వట్టి హస్తముల
దెచ్చిన దేదియు లే (దు గదా) (2)
||పరదేశుల||

ఎట్లు వచ్చితిమి ఈ లోకమునకు
అట్లు వెళ్ళవలయున్ (మింటికి) (2) 
||పరదేశుల||

యేసు నందు విశ్వాసం బుంచిన
వాసిగ నిను జేర్చున్ (బరమున) (2)   
||పరదేశుల||

యేసే మార్గము యేసే సత్యము
యేసే జీవముగా (నిజముగ) (2)   
||పరదేశుల||

** ENGLISH LYRICS **

Paradeshulamo Priyulaaraa Mana
Puramidi Gaadepudu (Nijamuga) (2)       
||Paradeshula||

Chithra Vasthuvulu Chelledi Yokavi
Chithramaina Santha (Lokamu) (2) 
||Paradeshula||

Santha Gollu Kshama Sadalina Chandam
Banthayu Saddanagan (Nijamuga) (2) 
||Paradeshula||

Sthiramani Nammaku Dhara Yevvarikini
Baralokame Sthiramu (Nijamuga) (2) 
||Paradeshula||

Medalu Middelu Melagu Sarakulu
Paadai Kanabadave (Nijamuga) (2) 
||Paradeshula||

Dhara Dhaanyambulu Daragaka Maanavu
Pani Paatalu Poye (Nijamuga) (2)   
||Paradeshula||

Enni Naallu Mana Milalo Brathikina
Mannai Povunugaa (Dehamu) (2)   
||Paradeshula||

Vahchithi Michatiki Vatti Hasthamula
Dechchina Dediyu Le (du Gadaa) (2)   
||Paradeshula||

Etlu Vachchithimi Yee Lokamunaku
Atlu Vellavalayun (Mintiki) (2) 
||Paradeshula||

Yesu Nandu Vishwaasam Bunchina
Vaasiga Ninu Jerchun (Baramuna) (2) 
||Paradeshula||

Yese Maargamu Yese Sathyamu
Yese Jeevamugaa (Nijamuga) (2)   
||Paradeshula||

--------------------------------------------------------
CREDITS : 
--------------------------------------------------------