1573) నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై

** TELUGU LYRICS **   

    నిత్యుడేసునే స్తుతించు - తన సత్యము కొరకై
    అను పల్లవి: మధ్యవర్తియాయే చెదరిన - పరిశుద్ధులకు తానే యిలలో

1.  మేఘ మండల మంటుచున్నది - నాకు దాహంబది తీర్చుచున్నది
    వేగమే మనుజులను మార్చివేయును - మార్చివేయునదియే

2.  విడుదలను ఇచ్చునదియే - విడిపించు ఘోరపాపము నుండి
    కడు శ్రమలనది స్వీకరించును స్వీకరించునదియె

3.  పృధివి నెల్లయు మారిపోయినన్ - సత్యమెన్నడు మారనే మారదు
    నిత్యమైన యేసు సత్యమాయెనిలలో - సత్యమాయెనిలలో

4.  ఖడ్గంబుబోలి కోయునదియె - పడగొట్టును దుష్టులనదియే
    వడివడిగా తనపని నెరవేర్చునదియె - నెరవేర్చునదియే

5.  ఉదకంబు బోలి కడుగునదియె - అద్దముబోలి చూపునదియే
    అది బంగారు విలువ గలది - విలువ గలదియే

6.  దీపమై చీకటిని పోగొట్టును - కోపమున్ బారద్రోలును నదియే
    ఆపదలనెల్ల తొలగించునదియె - తొలగించునదియే

7.  సుత్తెను బోలి పగులగొట్టును - మెత్తగా చేసి ఒప్పించునదియే
    క్రొత్త తేనెన్ బోలి రుచించునదియె - హల్లెలూయా ఆమెన్

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments