1603) నిన్నె వెదకెద నీకై బ్రదికెదా

** TELUGU LYRICS **

    నిన్నె వెదకెద నీకై బ్రదికెదా
    యేసుతో యీ జీవితం ఆనందమే ఇది సత్యం (2)

1.  చీకటి లోఐనా చింతలు ఎన్నో ఉన్నా (2)
    కన్నీరు తుడిచే యేసు నాతో ఉండగా
    నా గుండె గాయాలన్ని తానే మాన్పగా (2)
    యేసుతో యీ జీవితం
    ఆనందమే ఇది సత్యం (2)

2.  నా కొరకై ప్రాణ మిచ్చినా నీకొరకే జీవిస్తున్నా (2)
    నా ఆత్మ ప్రాణం సర్వం నిన్నే తలచగా
    నా గుండె శబ్దం నిత్యం యేసే యేసేగా (2)
    యేసుతో యీ జీవితం
    ఆనందమే ఇది సత్యం (2)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------