1577) నిన్న నేడు రేపు మారని దేవుడు నీవు

** TELUGU LYRICS **

    నిన్న నేడు రేపు మారని దేవుడు నీవు
    మనుషులు మారిన మమతల తరిగిన
    మార్పులేని దేవుడు నీవ్  (2)

1.  అబ్రహామును పిలిచావు యాకోబును దర్శించావు
    తరగని ప్రేమతో కృపతో నింపి మెండుగా దీవించావు
    ఈనాటికైనా ఏనాటికైనా మార్పులేని దేవుడు నీవు 

2.  యోసేపును హెచ్చించావు దావీదును ప్రేమించావు
    శ్రమలోనైనా ధైర్యము నింపి సర్వము సమకూర్చావు
    ఈనాటికైనా ఏనాటికైనా మార్పులేని దేవుడు నీవు 

3.  జీవపు మార్గము చూపించి ఆశ్రయ పురముకు నడిపించి
    నీ దయ నాపై కురిపించి నెమ్మది కలిగించావు
    ఈనాటికైనా ఏనాటికైనా మార్పులేని దేవుడు నీవు 

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------