1556) నింగిలోని చందురుడా మందగాచే ఇందురుడా

** TELUGU LYRICS **   

    నింగిలోని చందురుడా మందగాచే ఇందురుడా
    నిందలేని సుందరుడా గంధమొలికె చందరుడా
    ఓ వెన్నెలంటి చల్లని రాజా
    వెన్నలాంటి మనసు నీదయ్యా

1.  ఎర్రటి ఎండ కాల్చేస్తున్నా గాయాలు నిన్ను బాధిస్తున్నా
    దాహంతో నోరు ఎండిపోతున్ననాలుక అంగిట అంటిపోతున్న
    ప్రేమతో పెంచిన మమతలు పంచిన నీ శ్రమ చూడలేక గుండెపగిలినా
    తల్లిని శిష్యుని కప్పగించి నీ బాధ్యతను నెరవేర్చినావా
    ఓ వెన్నెలంటి చల్లని రాజా ఎంత ప్రేమ మూర్తి నీవయ్యా

2.  అందాల మోముపై ఉమ్మి వేయగా నీదు గెడ్డము పట్టి లాగగా
    యూదుల రాజని అపహసించగా సిలువ దిగి రమ్మని పరిహసించగా
    అంతా సహించి మౌనంవ్ వహించి బాధించువారిపై ప్రేమ చూపించి
    ఏమి చేస్తున్నారో యెరుగరు క్షమియించుమని ప్రార్థించినావా
    ఓ వెన్నెలంటి చల్లని రాజా ఎంత సహనం చూపినావయ్యా

3.  లేత మొగ్గలాంటి నీ దేహముపై కొరడాలెన్నో నాట్యము చేయగా
    మేలే చేసినా కరుణను పంచినా కాళ్ళు చేతులలో చీలలు కొట్టగా
    అంతటి శ్రమలో చెంతను నిలచి చింతలో వున్నా అతివల చూచి
    నా కోసం ఎడ్వవలదని పలికి వారిని ఓదార్చినావా
    ఓ వెన్నెలంటి చల్లని రాజా ఎంత కరుణామయుడ నీవయ్యా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------