1861) నేనే భయపడ వలదని పలికెను

** TELUGU LYRICS **

    నేనే భయపడ వలదని పలికెను
    మన రక్షకుడు యేసుప్రభు

1.  తన సమాధానము నీ కిచ్చి - కృపల నెన్నో చూపెనుగా
    తనివి తీర స్తుతి చెల్లించుము - తనదు ప్రేమదయకొరకు

2.  శాశ్వతంబగు జాలిజూపి - శాశ్వతరక్షణ నొసగి
    విశ్వాసముతో నిలచిన యెడల - శాశ్వత రాజ్యం బొసగు

3.  నరుడుకాడు దేవుడతడు - నరుడు ఆయెను నీ కొరకు
    కరుణతో నిను రక్షించుటకు - సర్వమిచ్చెను శ్రీ యేసు

4.  మరణించెను ప్రభు నీ కొరకే - తిరిగి లేచెను కాపాడన్
    త్వరగ వచ్చును కనిపెట్టుము - నిరతమాయనతోనుండ

5.  ఎంత పాపివైన నిలలో - చింత లేదిక నమ్మినచో
    వింత రక్షకుడేసు ప్రభువు - స్వంత ప్రాణమునర్పించె

6.  నీదుయాత్రలో బలమిచ్చుటకు - తనదు దేహరక్తమును
    ముదముతో అర్పించిన ప్రభుకే - హల్లెలూయా పాడుము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------