** TELUGU LYRICS **
నేనే భయపడ కూడదనెను ఆ ఆ ఆ
ఆ - ఆ - ఆ శిష్యులను ధైర్యపరచిన వాడతడే
ఆ - ఆ - ఆ శిష్యులను ధైర్యపరచిన వాడతడే
1. ఐదు రొట్టెలు రెండు చేపలతోనే - ఐదువేలను పోషించినవాడే
అద్దరికి వెళ్ళ నాజ్ఞాపించిన ప్రభువే - ప్రేమించిన వాడే
అద్దరికి వెళ్ళ నాజ్ఞాపించిన ప్రభువే - ప్రేమించిన వాడే
2. గాలి యెదురైన ధైర్యము విడువకు - అన్నియు మేలుకై సమకూడి జరుగును
అంతము వరకు తోడుగ నుండును - మొరలిడి కలవరపడకుడి
అంతము వరకు తోడుగ నుండును - మొరలిడి కలవరపడకుడి
3. లోకములో మీకు శ్రమలే కలుగున్ - శ్రమలే సహజము నరులందరికిన్
శ్రమలో ధైర్యము కలిగించుటకై - వాగ్దానము లన్నియు నిచ్చెను
శ్రమలో ధైర్యము కలిగించుటకై - వాగ్దానము లన్నియు నిచ్చెను
4. ఆయనే దేవుడు ఊరక యుండుడి - ఆయననే యెరుగుడి మీరు
ఉన్నతుడాయనే అన్యజనులలో - మహోన్నతుడు భూజనములలో
ఉన్నతుడాయనే అన్యజనులలో - మహోన్నతుడు భూజనములలో
5. కలవర పడకుండని నడువుచు తనబిడ్డల నాదరించినవాడే
పరిశుద్ధాత్ముని అందర కొసగి - కృపజూపిన మహాప్రభుండే
పరిశుద్ధాత్ముని అందర కొసగి - కృపజూపిన మహాప్రభుండే
6. యుద్ధము చేయును యెహోవా - స్తుతించుట మన విధి యగును
యుద్ధాయుధము ఆత్మీయమైనది - ఆయనకే స్తుతి హల్లెలూయా
యుద్ధాయుధము ఆత్మీయమైనది - ఆయనకే స్తుతి హల్లెలూయా
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------