1715) నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా

** TELUGU LYRICS **

    నీ పాద సన్నిధికి - కృపామయ యేసయ్యా
    నీ ప్రేమ కనుగొనుచు - దేవా నే వచ్చితిని

1.  విశ్రాంతి నిచ్చెడు దేవా - శ్రమలెల్ల తీర్చుమయ్యా
    సిలువయే నా ఆశ్రయము - హాయిగా నచటుండెదను

2.  ప్రార్థించుమంటివి ప్రభువా - సంకట సమయములో
    దయచూపి నను కరుణించి - ప్రేమతో ఆదరించుమయ్యా

3.  నరమాత్రుడవు నీవు కావు - మొఱ నాలకించుము
    మనస్సార ప్రార్థించుచు - యేసు నీదరి చేరెదను

4.  నన్ను చేయి విడువకు నాథా - నిందలెన్నో పొందినను
    నీకై సహించెదనంత - నీ బలము నా కిమ్ము

5.  ఆశతో నీ ముఖమును నేను - ఆసక్తితో చూడ
    సిగ్గుపడనుగా నేను - నీ ప్రకాశము నాపై నుండ

6.  శత్రువు నోడించుటకు - నీ శక్తిని చూపు
    నన్నాదరించి నీవు - ఆవరించి కాపాడుము

7.  జీవించి ఎదుగునట్లు - జయ జీవితంబిమ్ము
    ఫలించి వర్థిల్లుతకై - ప్రభువా నీ కృప నిమ్ము

8.  సీయోను మూలరాయి - అయ్యున్న ఓ ప్రభువా
    కలతను చెందక నేను - నీకై కనిపెట్టెదను

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------