1710) నీ నావలో యేసు ఉండగా భయమేలరా సోదరా

** TELUGU LYRICS **

నీ నావలో యేసు ఉండగా భయమేలరా సోదరా
నీ పక్షమై యేసు ఉండగా దిగులేలమ్మా సోదరీ
ఏ వ్యాధి ఏమీ చేయలేదుగా సోలిపోకురా
ఏ మూలన అది ఉన్నను నీ దరికి రాదురా
క్రుంగిపోకు అలసిపోకు యేసయ్య నీతోనుండగా
లోకమంతా చీకటి కమ్ముచున్నా నీపైన వెలుగుంది రా
నీకై తన కుమారుని పంపెను ఆ ప్రేమను చూడుమా
ఏ తెగులు నీ దరి చేరకుండ ఆ ప్రేమ ఆపును రా
మోషేకు దేవుడు ప్రత్యక్షమైన స్థలము గుర్తున్నదా
మండుచున్న ఆ పొదను చూడుమా కాలిపోలేదుగా
ఏదైన చేయగల దేవుడు నీకు తోడుండగా
నీ భయము విడచి ధైర్యముతో యేసయ్యను పాడరా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------