** TELUGU LYRICS **
నీ ముఖము మనోహరము - నీ స్వరము మాధుర్యము
నీ పాదాలు అపరంజి మయము
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా - మనగలనా నిను వీడి క్షణమైన
నీ పాదాలు అపరంజి మయము
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా - మనగలనా నిను వీడి క్షణమైన
1. నీవే నాతోడువై నీవే నాజీవమై - నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై
అణువణువున నీకృప నిక్షిప్తమై
నను ఎన్నడు వీడని అనుబంధమై
||యేసయ్య||
2. నీవే నా శైలమై నీవే నాశృంగమై - నా విజయానికే నీవు భుజబలమై
అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై
నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు
అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై
నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు
||యేసయ్య||
3. నీవే వెలుగువై నీవే ఆలయమై - నా నిత్యత్వమునకు ఆద్యంతమై
అమరలోకాన శుద్ధులతో పరిచయమై
నను మైమరచి నేనేమి చేసేదనో
అమరలోకాన శుద్ధులతో పరిచయమై
నను మైమరచి నేనేమి చేసేదనో
||యేసయ్య||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------