1629) నీ కనికరములు తరతరములు నీ కార్యములు ఆశ్చర్యకరములు

** TELUGU LYRICS **

నీ కనికరములు తరతరములు – నీ కార్యములు ఆశ్చర్యకరములు
నీ మహిమలు తరతరములు – నీ తలంపులు అత్యున్నతములు
నీ నామం నిలుచును యుగయుగములు
నీ నామం నిలుచును తరతరములు
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య

మోషేకు ఎర్ర సముద్రము అడ్డుగా నిలబిడగా
యెహోషువ యెరికో గోడలను కూల్చ చుట్టుముట్టగా
నీ కృపను క్రుమ్మరించినావు – నీ ప్రేమను ప్రకటించినావు
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
నీ నామం నిలుచును యుగయుగములు
నీ నామం నిలుచును తరతరములు

సింహాల బోనులో దానియేలు మోకరించి ప్రార్ధించగా
చెరసాలలో పౌలు సీలలు సంకెళ్లతో స్తుతియించగా
నీ కృపను క్రుమ్మరించినావు – నీ ప్రేమను ప్రకటించినావు
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
నీ నామం నిలుచును యుగయుగములు
నీ నామం నిలుచును తరతరములు

అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వ సిద్దపడగా
అన్నల పగకు యోసేపు బానిసగా అమ్మబడగా
నీ కృపను క్రుమ్మరించినావు – నీ ప్రేమను ప్రకటించినావు
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------