1668) నీ జీవితము క్షణభంగురమే ఒక గడియలోనే గతియించెదవు

** TELUGU LYRICS **   

    నీ జీవితము క్షణభంగురమే - ఒక గడియలోనే గతియించెదవు

1.  నీటి బుడగవలె నీ జీవితము - సంపూర్ణముగా నశియించు
    సాగిపోయెడు నీడవలెనే నీదు బ్రతుకు వున్నదిగా

2.  ధన సంపదలు గౌరవములు - ధరలోనున్న సర్వమును
    వ్యర్థము వీటి వైభవమంతయు - విడిచెదవు ఒక దినమందే - నీవు

3.  మోసపోతివిగా నీవు యిలలో - నష్టపడితివి పాపములో
    నేడే రమ్ము యేసుని కడకు - నీకై రక్తము చిందించెనుగా
    నిన్ను పిలుచుచున్నాడు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------