1701) నీ దేవుడేడంచు నన్నడుగుచున్నారు

** TELUGU LYRICS **

    నీ దేవుడేడంచు నన్నడుగుచున్నారు
    ఎక్కడున్నావని చెప్పనూ
    ఎలా వున్నావని చూపను యేసు (2)

1.  ఆకాశముల నడుగరాదా అంతరిక్షము చెప్పలేదా
    యేసురాజే స్రుస్టికర్తయని యేసు నాధుడే సార్వభౌముడని
    అంతరిక్షము చెప్పలేదా ఆకాశముల నడుగరాదా

2.  నక్షత్రముల నడుగరాదా సాక్షులై అవి చెప్పలేదా
    యేసురాజే దేవదేవుడని విశ్వమంత యేసు సృస్టియని
    సాక్షులై అవి చెప్పలేదా నక్షత్రముల నడుగరాదా

3.  మానవాత్మను అడుగరాదా అంతరాత్మే చెప్పలేదా
    యేసు దేవుడే నిన్ను చేసేనని యేసు లేనిదే ఏది కలుగలేదని
    అంతరాత్మే చెప్పలేదామానవాత్మను అడుగరాదా

4.  దైవ వాక్యం చదువరాదా వాక్యసత్యం చెప్పలేదా
    యేసు ప్రజల రక్షకుండని యేసే ప్రజల విమోచకుండని
    వాక్యసత్యం చెప్పలేదాదైవ వాక్యం చదువరాదా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------