1651) నీ చల్లని చూపుతో కరుణించినందున

** TELUGU LYRICS **

నీ చల్లని చూపుతో కరుణించినందున
బ్రతికి ఉన్నానయా
నీ చేయి చాపి లేవనెత్తినందున
జీవించుచున్నానయా
యేసయ్యా నా మంచి యేసయ్యా
నీ కృపతో నన్ను కాపాడితివి
యేసయ్యా నా గొప్ప యేసయ్యా
నీ దయ చూపించి స్వస్థతనిచ్చితివి
నా భుజములపై చేయివేసితివి
దిగులు బెంగ వద్దని నాతో అంటివి
నీ సన్నిధి నాకు తోడుగా ఉంచితివి
నా కన్నీళ్లు ప్రతిరోజు తుడిచితివి
నీ కృపతో కనికరించి నా వ్యాధి బాధలలో
కంటి పాపగా నను కాపాడితివి
నా బలహీనతలో బలమై నిలిచితివి
చీకు చింత వద్దని నాతో అంటివి
నీ సర్వము నాకు తోడుగా ఉంచితివి
నా నిట్టూర్పులో నన్ను బలపరచితివి
నీ కృపతో ఆదరించి నా క్షామకాలంలో
మంచికాపరివై నన్ను కాపాడితివి

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------