1874) నే బోధింప జనాళికిన్ నేర్పింపు నాకు

** TELUGU LYRICS **

1.  నే బోధింప జనాళికిన్ - నేర్పింపు నాకు నో ప్రభు
    నన్ వెద్కినట్లు నేనును - నశించువారిన్ వెద్కెదను

2.  ఆత్మీయ భోజనంబుతో - పోషించునట్లు నన్నును
    మూర్ఛిల్లువారికిన్నదే - నేనియ్యగాను నడ్పుమా

3.  కష్టంబులొందు వారిని రక్షింప గల్గునట్లుగా
    నాకిమ్ము నీదు శక్తిని - నన్ ధైర్య పర్చుమో ప్రభూ

4.  నే నేర్పునట్లు నాకును - నీ దివ్య వాక్యం నేర్పుము
    ఆలించునట్లనేకులు - నా బోధను దీవింపుమా

5.  ప్రయాసమొందు వారికి - విశ్రాంతి కల్గునట్లుగా
    ఓదార్చు శక్తి మెండుగా - నీ యాత్మచే నాకిమ్మయా

6.  నీ దివ్యమోము జూచుచున్ నీ హాయి సంతోషంబులు
    నే నొందుదాక నన్నిలన్ - నీ చిత్తమార నడ్పుమా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------