** TELUGU LYRICS **
నమ్మరె నరులార యేసుని సమ్మతిగాఁ జేరి నమ్మిన వారల నిమ్ముగ
బ్రోచును సొమ్ముగ తను జేర్చి
బ్రోచును సొమ్ముగ తను జేర్చి
||నమ్మరె||
1. యేసు క్రీస్తుకంటెఁ పోషకు లెవ్వరు లేరుసుమీ దోషుల తన
దాసులుగాఁ దీసియు దోసముఁ బాపు సుమీ
||నమ్మరె||
2. నరకము నొందక మీ రయ్యో నరకము బాధ సుమీ న్యాయము
కాదుసుమి నరులార నష్టము మీకు సుమీ
2. నరకము నొందక మీ రయ్యో నరకము బాధ సుమీ న్యాయము
కాదుసుమి నరులార నష్టము మీకు సుమీ
||నమ్మరె||
3. తండ్రి కొమరుఁడు విమ లాత్ముఁడు త్ర్యేకదేవుండు తండ్రి వలెను
మనలను పాలించును తండ్రిగ నమ్ముదము
3. తండ్రి కొమరుఁడు విమ లాత్ముఁడు త్ర్యేకదేవుండు తండ్రి వలెను
మనలను పాలించును తండ్రిగ నమ్ముదము
||నమ్మరె||
4. ధరణిలో నొకఁడైన చూడరె ధన్యుడు లేఁడనుచు దీర్ఘదర్శి దావీదు
తెల్పె నిటు దీనుల కందఱికి
4. ధరణిలో నొకఁడైన చూడరె ధన్యుడు లేఁడనుచు దీర్ఘదర్శి దావీదు
తెల్పె నిటు దీనుల కందఱికి
||నమ్మరె||
5. ప్రభు మన పాపముకై ప్రాణము బలిగా నిచ్చునుగా పాపము
మోసెను మృతియై లేచెను పాపులఁ బ్రోచుటకై
5. ప్రభు మన పాపముకై ప్రాణము బలిగా నిచ్చునుగా పాపము
మోసెను మృతియై లేచెను పాపులఁ బ్రోచుటకై
||నమ్మరె||
6. దేవసుతుని రక్తం అబ్బిన ద్రోహుల కతిప్రొయము పావన మొనరించును
పాపికి నిఁక జీవనమై యుండున్
6. దేవసుతుని రక్తం అబ్బిన ద్రోహుల కతిప్రొయము పావన మొనరించును
పాపికి నిఁక జీవనమై యుండున్
||నమ్మరె||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------