1341) నమ్మదగినవాడవు నెమ్మదిని చేకూర్చను

** TELUGU LYRICS **

    నమ్మదగినవాడవు - నెమ్మదిని చేకూర్చను
    యిమ్మహిలో యెంతైనను - నమ్మిన నను గాచెడి

1.  అలలు గాలి తుఫానులవలె - శ్రమలు నన్నిలగొట్టిన
    అమరమందు నిల్చియేసు - అన్నిటిని గద్దించును

2.  నరుల రాజులనమ్మిన - నిరుపయోగమె యెందున
    కరము జాచిన కష్టములలో - కొరతలన్నిటి తీర్చును

3.  యాత్రికులు ప్రయాణికులుగా - యాతనలు మే బొందిన
    నూతన జీవముతో నీ - పాత్రలుగను వాడను

4.  ఆత్మ జీవశరీరములను - ప్రభువు రాకడయందున
    నిందారహిత సంపూర్ణమహిమలో - నుండునట్లుగ నిల్పను

5.  పరమ తండ్రి కృపాతిశయమును - నిరతమును కీర్తించెద
    తరములకు విశ్వాస్యతను నా - నోటితోనే తెల్పెద

6.  శోధనలన్నీ సహించెడి - వరకె నా కవినిచ్చియు
    శోధనలు తప్పించుకొను యా - మార్గమును కలిగించుము

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------