1308) నడిపించుచున్నాడు నజరేయుడు

** TELUGU LYRICS **

    నడిపించుచున్నాడు - నజరేయుడు
    నడక నేర్పుచున్నాడు - నను విడువని దేవుడు
    గాఢాంధకారములైనా - కన్నీటి లోయలైనా
    కష్టాల తీరములైన - కఠినమైన మార్గములైనా 
    ||నడిపించు||

1.  నా కాళ్ళు తడబడగా - నడువ లేక నిలబడగా (2)
    అడుగులో అడుగేసి - చేతిలో చెయ్యేసి (2)
    ఊసుచెప్పినాడు - బాసచేసినాడు (2)
    ఆదరించే దేవుడు నా యేసయ్యా ఆశీర్వదించే దేవుడు నా యేసయ్య 
    ||నడిపించు||

2.  ముదిమిలో బలముడిగి - నిలువలేక తూలిపోగా (2)
    చంకలో ఎత్తుకొని - ముద్దులతో ముంచెత్తి (2)
    ప్రేమ చూపినాడు - ప్రాణమిచ్చినాడు (2)
    ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా 
    ||నడిపించు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------