1503) నాయాత్మ లంగరువేయ సుస్థిర భూమి చిక్కెను

** TELUGU LYRICS **

1.  నాయాత్మ లంగరువేయ - సుస్థిర భూమి చిక్కెను
    నా పాపము హరించెడు - నిత్యుండౌ యేసుగాయముల్
    కల్పాంతకాలమైనను - సదా యీ ప్రేమనిల్చును

2.  తండ్రీ! నీ ప్రేమ నిత్యమై - మాయల్ప బుద్ధిని మించు
    నీ యుల్లమందు సర్వదా - కారుణ్యముండినందున
    మరలివచ్చు పాపులన్ - జేర్చి జీవింప జేతువు

3.  నీ ప్రేమ లోతుతేలదు - మేమెన్న శక్యముగాదు
    నా పాపమంత దాచితి నిర్దోషిగా నన్నెంచితి
    శ్రీయేసు పుణ్యముండగా - ధారాళ కృపనిత్తువు

4.  నా కష్టముల్ తుఫానుగా - నా తలపైన క్రమ్మిన
    లోకేచ్ఛలన్ని భంగమై - యసౌఖ్యముల్ ప్రాప్తించిన
    నీ ప్రేమ నిత్యము కాగా - నదే నాయాత్మలంగరు

5.  హృదయ భీతియుండిన - ప్రపంచము లయించిన
    నీ వన్ని కదిలింపుము - నాలంగర్ స్థిరమై యుండి
    ననంత ప్రేమ శక్తిని అనుభవింతు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------